శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 13:27:58

ప్లీజ్‌.. మా పాప ఫొటోలు తీయొద్దు!

ప్లీజ్‌.. మా పాప ఫొటోలు తీయొద్దు!

ముంబై: ద‌య‌చేసి మా పాప ఫొటోలు తీయొద్దు అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శ‌ర్మ ముంబై ఫొటోగ్రాఫ‌ర్ల‌ను కోరారు. త‌మ కూతురి ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని వారు ఫొటోగ్రాఫ‌ర్ల‌కు రాసిన లేఖ‌లో అడిగారు. త‌ల్లిదండ్రులుగా మేము కోరుతున్న‌ది ఒక‌టే. మా పాప ప్రైవ‌సీని ర‌క్షించాల‌ని అనుకుంటున్నాం. దానికి మీ సాయం, మ‌ద్ద‌తు కావాలి అని విరుష్క త‌మ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. స‌రైన స‌మ‌యంలో త‌మ పాప ఫొటోల‌ను రిలీజ్ చేస్తామ‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 11న త‌మ‌కు పాప పుట్టింద‌ని కోహ్లి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత విరాట్ సోద‌రుడు వారికి కంగ్రాట్స్ చెబుతూ.. ఓ ఫొటో షేర్ చేయ‌డంతో అది వాళ్ల పాప‌దే అంటూ అభిమానులు వైర‌ల్ చేసేశారు. కానీ ఆ ఫొటో ఆ పాప‌ది కాదు అని మ‌రోసారి కోహ్లి సోద‌రుడు వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. 


logo