e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home స్పోర్ట్స్ వినేశ్‌కు తొలి ఆసియా స్వర్ణం

వినేశ్‌కు తొలి ఆసియా స్వర్ణం

వినేశ్‌కు తొలి ఆసియా స్వర్ణం

అల్మాటి: ఆసియా చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారత రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్‌ (53 కేజీలు), అన్షు మాలిక్‌ (57 కేజీలు), దివ్యా కక్రాన్‌ (72 కేజీలు) స్వర్ణ పతకాలతో మెరిశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్స్‌లో ముగ్గురు రెజర్లు ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు సాధించారు. ఒక్కపాయింట్‌ కూడా కోల్పోకుండా బౌట్లన్నీ గెలిచిన వినేశ్‌తో పాటు 19 ఏండ్ల సంచలనం అన్షుకు కూడా ఆసియా టోర్నీలో ఇదే తొలి స్వర్ణం. ఫైనల్‌లో వినేశ్‌ 6-0తో మెంగ్‌ హుసాన్‌షీహ్‌ (తైవాన్‌)ను, అన్షు 3-0తో అల్టాంట్‌సెట్సెగ్‌ (మంగోలియా)ను చిత్తు చేశారు. మరోవైపు దివ్య సైతం సునాయాసంగానే పసిడి గెలువగా.. స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ (65 కేజీలు) తుదిపోరులో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. దీంతో నాలుగు పసిడి సహా టోర్నీలో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరింది. కాగా..టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం(టాప్స్‌) స్కీమ్‌లో యువ రెజర్లు సోనమ్‌ మాలిక్‌, అన్షు మాలిక్‌తో పాటు నలుగురు సెయిలర్లకు చోటు లభించింది.

ఇవీ కూడా చదవండీ…

ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు చేరాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

హోటల్స్‌ అడ్డాగా ఐపీఎల్‌ బెట్టింగ్

Advertisement
వినేశ్‌కు తొలి ఆసియా స్వర్ణం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement