మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 18, 2020 , 03:20:54

వినేశ్‌ పసిడి పట్టు

వినేశ్‌ పసిడి పట్టు

రోమ్‌: రోమ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌(53కేజీలు) అదరగొట్టింది. ఈక్వెడార్‌ రెజ్లర్‌ ఎలిజబెత్‌ వాల్వెర్డ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్‌ బౌట్‌లో వినేశ్‌ 4-0తో అద్భుత విజయం సాధించింది. తనదైన పట్టుతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వినేశ్‌ పాయిట్లు కొల్లగొట్టింది. భుజ బలంతో ఉక్కిరిబిక్కిరి చేసి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ఈసీజన్‌లో వినేశ్‌ ఇది తొలి పతకం. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో వినేశ్‌ 4-2తేడాతో క్వియాన్యు పంగ్‌(చైనా)పై విజయం సాధించింది. మ్యాచ్‌ మొత్తం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థికి ఊపిరి సలుపనివ్వలేదు. అంతకు ముందు హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో ఫోగట్‌ 15-5తో చైనాకే చెందిన లానువాన్‌ లావ్‌పై అద్భుత విజయం సాధించింది. తన తొలి అంతర్జాతీయ సీనియర్‌ సిరీస్‌లో 18 ఏండ్ల నయా సంచలనం అన్షు మాలిక్‌ రజతంతో మెరిసింది. ఫైనల్లో 0-10తేడాతో ఒడునాయో అడేకోయ్‌రొయే(నైజీరియా)కు ఏ మాత్రం పోటీనివ్వలేక ఓటమి పాలైంది. కాగా, సెమీస్‌లోనే ఓడిన నిర్మలా దేవి కాంస్య పోరులోనూ నిరాశపరిచింది. పురుషుల ఫ్రీస్టయిల్‌లో సత్యవర్త్‌ (97కేజీలు), సుమీత్‌ (125కేజీలు) క్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. 


logo
>>>>>>