గుడాంస్క్ (పోలండ్): అత్యంత ఉత్కంఠ మధ్య.. నాటకీయంగా జరిగిన యూరోపా లీగ్ ఫైనల్లో ప్రముఖ జట్టు మాంచెస్టర్ యునైటెడ్‌ను మట్టికరిపించి విల్లారియాల్ ఫుట్‌బాల్ జట్టు సంచలనం సృష్టించింది. యూరప్ సాకర్‌లో స్టార్‌గా వెలుగొందుతున్న మాంచెస్టర్‌కు షాకిచ్చి టైటిల్ దక్కించుకుంది. గురువారం ఇక్కడ జరిగిన ఫైనల్ 1-1తో డ్రా అయిన అనంతరం షూటౌట్లో విల్లారియాల్ 11-10 తేడాతో మాంచెస్టర్‌ను ఓడించి యూరోపా లీగ్ విజేతగా నిలిచింది. షూటౌట్ హోరాహోరీగా సాగగా.. వరుసగా గోల్స్ వర్షం కురిపించి విల్లారియాల్ జట్టు గెలిచింది. గోల్ కీపర్ డేవిడ్ డె గీ చేసిన తప్పిదాలు మాంచెస్టర్ కొంపముంచాయి. కాగా 98 సంవత్సరాల క్లబ్ చరిత్రలో విల్లారియల్కు ఇదే అతిపెద్ద టైటిల్ కావడం విశేషం.