శనివారం 28 మార్చి 2020
Sports - Mar 10, 2020 , 23:39:43

ఫైనల్లో వికాస్‌, సిమ్రన్‌

ఫైనల్లో వికాస్‌, సిమ్రన్‌
  • మేరీ, అమిత్‌కు కాంస్యాలు

అమన్‌(జోర్డాన్‌): ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత బాక్సర్లు వికాస్‌ కృష్ణన్‌(69కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌(60కేజీలు) తుదిపోరుకు దూసుకెళ్లగా.. సెమీస్‌లో ఓడిన దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌(51కేజీలు), ప్రపంచ అగ్రర్యాంకర్‌ అమిత్‌ పంగల్‌(52కేజీలు),ఆశీష్‌ కుమార్‌ (75 కేజీలు),లవ్లీనా (69కేజీలు), పూజా రాణి(75కేజీలు) కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల సెమీస్‌లో సిమ్రన్‌ 4-1తేడాతో షియూ వూ(తైవాన్‌)పై గెలువగా..  మేరీ 1-4తేడాతో చాంగ్‌ యున్‌(చైనా) చేతిలో ఓడింది. పురుషుల సెమీస్‌లో వికాస్‌ కృష్ణన్‌ 3-2తేడాతో అబ్లిఖాన్‌ జుసుపోవ్‌(కజకిస్థాన్‌)పై గెలిచాడు. ఫైనల్లో ఇషియా హుసేన్‌(జోర్డాన్‌)తో తలపడనున్నాడు. 


logo