గోబెల్స్ మీలాగే భ్రమపడి కాలగర్భంలో కలిసిపోయాడు..మీ పరిస్థితీ అంతే!

అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్ఆర్సీపీ నీచరాజకీయం చేస్తోందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శించిన విషయం తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. 'పోలవరం ఎత్తు గురించి బాబు, అను’కుల మీడియా పదే పదే అబద్దాలు చెబుతున్నారు. ఒక అసత్యాన్ని వందల సార్లు చెబితే జనం నమ్ముతారన్న సిద్ధాంతం రూపకర్త జోసెఫ్ గోబెల్స్ మీలాగే భ్రమపడి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాడు. మీ పరిస్థితీ అంతే!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
'రాష్ట్రంలో క్షీర విప్లవం మొదలైంది. మూడు దశల్లో అన్ని గ్రామాల్లో అమూల్ ద్వారా పాల సేకరణ ప్రారంభమవుతుంది. హెరిటేజ్, మిగిలిన ప్రైవేటు డెయిరీల కంటే లీటరుకు రూ.4-5 అదనంగా చెల్లిస్తారు. పాడి పశువుల పంపిణీ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు పుంజుకుంటుందని' విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ఆక్సిజన్ పార్కును ప్రారంభించనున్న మంత్రి హరీశ్
- కార్పొరేట్ల అనుకూల బడ్జెట్టే : వ్యవసాయ మంత్రి
- ఏఆర్ రెహమాన్‌ను కలిసిన టీమిండియా యంగ్ ప్లేయర్
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం