శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 18, 2020 , 15:57:45

'దొంగే దొంగని అర్చినట్టు లేదూ?'

'దొంగే దొంగని అర్చినట్టు లేదూ?'

విజయవాడ: 'అమరావతి కోసం  రోడ్లెక్కండి అంటూ  హైదరాబాద్ ఇంటిపట్టున  ఉండి  చెప్తున్నాడు జూమ్ బాబు' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శించారు. కరోనాకు భయపడి  తన ఇంటికి  పార్టీ  సీనియర్  నాయకులను  కూడా  రానివ్వడం  లేదని అన్నారు.  నాయకుడంటే  ముందుండి  నడపాలి  బాబు. ఇంట్లో  కూర్చొని  జూమ్  ద్వారా కాదు. అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.  

‘మనవాళ్లు బ్రీఫుడు మీ’ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మర్చి పోలేదు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అర్చినట్టు లేదూ? అని విజయసాయిరెడ్డి  మరో ట్వీట్‌  చేశారు. 


logo