ఆదివారం 17 జనవరి 2021
Sports - Nov 28, 2020 , 22:38:27

విజయ్‌ శంకర్‌ ‌ కంటే హార్దిక్‌ నయం: గంభీర్‌

విజయ్‌ శంకర్‌ ‌ కంటే హార్దిక్‌ నయం: గంభీర్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియాలో సమతూకం సరిగ్గా లేదని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమైన భారత్‌...ఓటమిపాలైన నేపథ్యంలో గంభీర్‌ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఆల్‌రౌండర్‌గా విజయ్‌ శంకర్‌ కన్నా పూర్తి ఫిట్‌నెస్‌ లేని హార్దిక్‌ పాండ్య నయమని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

‘గత ప్రపంచకప్‌ నుంచి జట్టును గమనిస్తున్నాం. ఇప్పటి వరకు జట్టులో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌ లేడు. బౌలింగ్‌ చేసే ఫిట్‌నెస్‌ పాండ్యకు లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. కానీ పాండ్య లాగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగల సత్తా శంకర్‌కు లేదన్నది నా నమ్మకం. ఆసీస్‌ విషయానికొస్తే..స్టోయినిస్‌, మ్యాక్స్‌వెల్‌ రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్నారు. వీరితో పాటు సీన్‌ అబాట్‌, కామెరాన్‌ గ్రీన్‌, డానిల్‌ సామ్స్‌ అవకాశమిస్తే సత్తాచాటే వారే’ అని అన్నాడు.