మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 15, 2020 , 14:48:00

కోహ్లీకి స్వేచ్ఛనిస్తే..కప్పు గెలుస్తాడు: విజయ్‌ మాల్యా

కోహ్లీకి  స్వేచ్ఛనిస్తే..కప్పు గెలుస్తాడు: విజయ్‌ మాల్యా

ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ 2008 నుంచి బెంగళూరు టీమ్‌ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు.

లండన్‌:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)   టైటిల్‌ గెలిచే సమయం ఆసన్నమైందని ఆ జట్టు మాజీ యజమాని, పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా అన్నారు.  ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం టీమ్‌ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మాల్యా ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆర్‌సీబీ కొత్త లోగోను ఆవిష్కరించడంపై మాల్యా ట్విటర్లో స్పందించారు.  క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే మాల్యా ఆర్‌సీబీ ట్విట్లపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంటారు. కొత్త లోగో ఆవిష్కరణపై ఆయన స్పందిస్తూ.. 'సింహంలా గర్జించండి..కానీ, ఐపీఎల్‌ ట్రోఫీని బెంగళూరుకు తీసుకురండి! 'అంటూ వ్యాఖ్యానించారు. 

'అండర్‌-19 టీమ్‌ నుంచి విరాట్‌ కోహ్లీ ఆర్‌సీబీ ఫ్రాంఛైజీలోకి అడుగుపెట్టాడు. భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఒక ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతా అతనికి వదిలేయండి. పూర్తి స్వేచ్ఛనివ్వండి.  ఎన్నోఏండ్లుగా  నిరీక్షిస్తున్న ఐపీఎల్‌ ట్రోఫీ గెలవాలని ఆర్‌సీబీ అభిమానులు కోరుకుంటున్నారని' మాల్యా ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ 2008 నుంచి బెంగళూరు టీమ్‌ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. 
logo
>>>>>>