సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 07, 2021 , 00:45:52

20 నుంచి హజారే ట్రోఫీ

20 నుంచి హజారే ట్రోఫీ

న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ ఈ నెల 20 నుంచి మార్చి 14 వరకు జరుగనుంది. మొత్తం ఆరు వేదికల్లో బయోబబుల్‌ ఏర్పాట్ల మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. సూరత్‌, ఇండోర్‌, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్‌లలో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను శనివారం విడుదల చేయగా.. మరో వేదికను త్వరలోనే ఖరారు చేయనుంది. ఐదు ఎలైట్‌ గ్రూప్‌లు, ఓ ప్లేట్‌ గ్రూప్‌ ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఎలైట్‌ గ్రూప్‌-ఏలో హైదరాబాద్‌ ఉండగా.. మన జట్టు మ్యాచ్‌లు సూరత్‌లో జరుగనున్నాయి.


VIDEOS

logo