గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 27, 2021 , 17:28:53

కూతురితో రహానె డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

కూతురితో రహానె డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

చెన్నై: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మరో వారం రోజుల్లో చెన్నై వేదికగా టెస్టు సిరీస్‌ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు కూడా చెన్నై చేరుకున్నాయి. కరోనా కారణంగా భారత  ఆటగాళ్లు ఓ హోటల్‌లో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. 

వైస్‌ కెప్టెన్‌ రహానె, రోహిత్‌ శర్మ, శార్దుల్‌ ఠాకూర్‌ ఇప్పటికే మ్యాచ్‌ వేదిక చెన్నై చేరుకున్నారు. ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను వెంట తీసుకొచ్చుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. దీంతో కొంతమంది క్రికెటర్లు తమ భార్య, పిల్లలతో ఇక్కడికి వచ్చారు.  అందరూ క్వారంటైన్‌లో ఉండ్సాలి రావడంతో ఫ్యామిలీతోనే సరదాగా గడుపుతున్నారు. 

రహానె తన కూతురుతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. తొలి రోజు  సరదా సరదాగా  గడిచిందంటూ రహానె సతీమణి రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేసింది. క్వారంటైన్‌ మొదటి రోజు వినోదం అంటూ ఆమె ట్వీట్‌ చేసింది. కుమార్తెతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను షేర్‌ చేసింది. 

VIDEOS

logo