మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 14:54:52

ఐపీఎల్‌-2020 కో-స్పాన్సర్‌గా ‘వీఐ’

ఐపీఎల్‌-2020 కో-స్పాన్సర్‌గా  ‘వీఐ’

ముంబై: టెలికాం మార్కెట్‌లో తన సత్తా చాటేందుకు వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌)  ‘వీఐ’ పేరుతో     సరికొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభంకానున్న  ఐపీఎల్‌ 13వ సీజన్‌ కో-ప్రజెంటింగ్‌ స్పాన్సర్‌గా వీఐ వ్యవహరించనుంది.  స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రసారంకానున్న  ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కో స్పాన్సర్‌షిప్‌ హక్కులను  దక్కించుకున్నట్లు  వీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

'వొడాఫోన్,  ఐడియా రెండూ గతంలో  స్టార్‌స్పోర్ట్స్‌ ద్వారా  క్రికెట్‌తో సంబంధం కలిగి ఉన్నాయి.  స్టార్‌స్పోర్ట్స్‌  నెట్‌వర్క్‌కు ఉన్న భారీ వ్యూయర్‌షిప్‌ ద్వారా కొత్త బ్రాండ్‌ వీఐకి గుర్తింపుతో పాటు మిలియన్ల మంది ప్రేక్షకులకు చేరువకావడంలో  సహాయపడుతుందని మేం భావిస్తున్నట్లు'  స్టార్‌ స్పోర్ట్స్‌ సీఈవో గౌతమ్‌ ఠాకర్‌ తెలిపారు. ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11 ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం రూ.222కోట్లతో  బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 
logo