కరోనాతో పోరాడుతూ చంద్రో తోమర్ మృతి
న్యూఢిల్లీ: ఆరుపదుల వయసులో షూటింగ్ ప్రస్థానాన్ని ఆరంభించి ఎన్నో పతకాలు సాధించిన భారత వెటరన్ షూటర్ చంద్రో తోమర్ (89) కన్నుమూశారు. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతూ మీరట్‌లోని ఓ దవాఖానాలో ఆమె శుక్రవారం మృతిచెందారు. ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్‌లోని జోహ్రీ గ్రామానికి చెందిన చంద్రో తోమర్ 60 ఏండ్ల వయసు తర్వాత షూటింగ్ ప్రారంభించి.. ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కురాలైన షార్ప్ షూటర్‌గా నిలిచారు. ‘షూటర్ దాది’గా పేరొందిన తోమర్.. జాతీయ టోర్నీల్లో 30కి పైగా పతకాలు సాధించారు. తోమర్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన ‘సాండ్ కీ ఆంక్’ సినిమా పలు అవార్డులు సొంతం చేసుకుంది.