ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 18, 2021 , 02:43:55

స్వర్ణ లక్ష్మి!

స్వర్ణ లక్ష్మి!

  • మూడు పసిడి పతకాలతో మెరిసిన వెటరన్‌ అథ్లెట్‌ 

మల్కాజిగిరి, ఫిబ్రవరి 17: ఆటలకు వయసు అడ్డుకాదని 55 ఏండ్ల సుబ్బలక్ష్మి నిరూపించారు. మల్కాజిగిరికి చెందిన సుబ్బలక్ష్మి ఇటీవల మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ)లో జరిగిన 7వ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. మహిళల 400 మీటర్లు, 200మీటర్లు, 100 మీటర్ల రేసులో ఔరా అనిపిస్తూ పసిడి పతకాలు ఒడిసిపట్టారు. ఐదు పదుల వయసులోనూ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న సుబ్బలక్ష్మిని మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే హన్మంతరావు, కార్పొరేటర్‌ ప్రేమ్‌కుమార్‌ తదితరులు అభినందించారు. 

VIDEOS

logo