మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 18:45:37

ఆ షాట్ అద్భుతం

 ఆ షాట్ అద్భుతం

స‌చిన్ అప్ప‌ర్‌క‌ట్‌ను గుర్తుచేసుకున్న మ‌హ‌మ్మ‌ద్ కైఫ్‌


న్యూఢిల్లీ:  రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయ‌బ్ అక్త‌ర్ బౌలింగ్‌లో బ్యాటింగ్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కొట్టిన అప్ప‌ర్ సిక్స్ అద్భుత‌మ‌ని భార‌త మాజీ ఆట‌గాడు మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ అన్నాడు. 2003 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో స‌చిన్‌తో క‌లిసి 102 ప‌రుగులు జోడించిన కైఫ్ ఆ మ్యాచ్ వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించాడు. 

`17 ఏండ్ల త‌ర్వాత కూడా ఆ మ్యాచ్ ఇంకా తాజాగానే అనిపిస్తున్న‌ది. షోయ‌బ్ అక్త‌ర్ బౌలింగ్‌లో పాయింట్ మీదుగా సిక్స‌ర్ బాద‌డం అంటే మామూలు విష‌యం కాదు. 150 కిలో మీట‌ర్ల వేగంతో వ‌చ్చిన బంతిని అంతే వేగంగా కండ్లు చెదిరే రీతిలో స‌చిన్ పాజీ బౌండ్రీకి త‌ర‌లించాడు. పాజీ బ్యాటింగ్‌ను ధ్యానంగా భావిస్తారు. అందుకే క్రీజులో ఉన్న స‌మ‌యంలో ఎక్కువ‌గా మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌డు`అని కైఫ్ వివ‌రించాడు. 


logo