భారత్ చెత్త రికార్డు..అక్తర్ సంతోషం

అడిలైడ్:టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ దారుణ వైఫల్యంతో రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటైంది. టెస్టు చరిత్రలో భారత జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. టెస్టు చరిత్రలో నమోదైన అత్యల్ప స్కోరు మాత్రం ఆస్ట్రేలియా ఖాతాలోనే ఉన్నది. 1955లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 26 పరుగులకే ఆలౌటైంది.
భారత్ అత్యల్ప స్కోరుకే ఆలౌట్ కావడంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు తమ దేశ రికార్డును బద్దలు కొట్టిందని, చాలా సంతోషంగా ఉందని అన్నాడు. 2013లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ అత్యల్ప స్కోరు 49 నమోదు చేసింది. దారుణ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన ఆటగాళ్లు విమర్శలను ఎదుర్కొనేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉండాలని అక్తర్ సలహా ఇచ్చాడు.
'వాళ్లు(భారత్) మా రికార్డును కూడా బద్దలు కొట్టారు. 36 ఆలౌట్! ఇది చెత్త ప్రదర్శన. దారుణమైనది. కానీ, భారత్ మా(పాకిస్తాన్) రికార్డును బద్దలు కొట్టడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా, ఇలాంటివి క్రికెట్లో సహజం. ఓటమితో పాటు విమర్శలను భరించండి. ఇప్పుడు ఇదే జరగబోతోంది. సిద్ధంగా ఉండండి. బలమైన భారత జట్టు కూలిపోతోంది. ఇది చెడ్డ వార్త' అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి..