స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ‘స్టిరియన్ గ్రాండ్‌ప్రి’ టైటిల్ చేజిక్కించుకున్నాడు. పోల్ పొజిషన్‌తో ఆదివారం ప్రధాన రేసును ఆరంభించిన వెర్స్టాపెన్.. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్)ను రెండో స్థానానికి పరిమితం చేస్తూ దూసుకెళ్లాడు. వాల్తెరి బొటాస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం హామిల్టన్ కంటే వెర్స్టాపెన్ 18 పాయింట్ల ముందంజలో ఉన్నాడు. 2013 తర్వాత మెర్సిడెస్ డ్రైవర్లు వరుసగా నాలుగు రేసుల్లో టైటిల్ సాధించకపోవడం ఇదే తొలిసారి.