శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 05, 2020 , 16:50:07

వెలాసిటీ..47 పరుగులకే ఆలౌట్‌

వెలాసిటీ..47 పరుగులకే ఆలౌట్‌

షార్జా:  మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా ట్రయల్‌ బ్లేజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన వెలాసిటీ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో 15.1 ఓవర్లలో వెలాసిటీ 47 పరుగులకే ఆలౌటైంది.   

బ్లేజర్స్‌ బౌలర్ సోఫీ ఎక్లిస్టోన్‌(4/9) సంచలన ప్రదర్శన చేయడంతో వెలాసిటీ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాటపట్టారు. జులన్‌  గోస్వామీ(2/13), రాజేశ్వరీ గైక్వాడ్‌(2/13) బంతితో విజృంభించడంతో వెలాసిటీ కనీసం 50 పరుగులు కూడా  చేయలేకపోయింది.

వెలాసిటీ ఓపెనర్‌ షఫాలీ వర్మ(13) టాప్‌ స్కోరర్‌. సునె లూజ్‌(10), శిఖా పాండే(10), కాస్పరెక్‌(11 నాటౌట్‌)‌ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(1), స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ వేదా కృష్ణమూర్తి(0)  ఘోరంగా నిరాశపరిచారు. టోర్నమెంట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు ఇదే.