శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 15:17:10

రంజీ ఫైనల్‌: వసవాడ శతకం..పుజారా హాఫ్‌సెంచరీ

రంజీ ఫైనల్‌: వసవాడ శతకం..పుజారా హాఫ్‌సెంచరీ

రాజ్‌కోట్‌:  వరుసగా రెండోసారి రంజీ ఫైనల్‌ ఆడుతున్న సౌరాష్ట్ర భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. తొలి రోజు బ్యాటింగ్‌లో తడబడిన సౌరాష్ట్ర రెండో రోజు భారీగా పుంజుకుంది.  బ్యాట్స్‌మన్‌ అర్పిత్‌ వసవాడ శతకంతో అదరగొట్టగా..టెస్టు స్పెషలిస్ట్‌ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ జోడీ ఇన్నింగ్స్‌ను నడిపిస్తోంది.  తొలి రోజు సౌరాష్ట్రను కట్టడి చేసిన బెంగాల్‌ బౌలర్లు మంగళవారం ఆటలో తేలిపోయారు. 

మంచి బంతులను ఆచితూచి ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తున్నారు. వికెట్లు కోల్పోకుండా కుదురుకున్న ఈ జోడీ నెమ్మదిగా ఆడుతోంది. టీ విరామ సమయానికి సౌరాష్ట్ర 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. వసవాడ(106), పుజారా(51) క్రీజులో ఉన్నారు. అనారోగ్యంతో తొలి రోజు బ్యాటింగ్‌ కొనసాగించలేక మధ్యలోనే వెనుదిరిగిన పుజారా రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చి జట్టును ఆదుకున్నాడు. logo