ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 14, 2020 , 02:28:37

వసంత్‌ రాయిజి కన్నుమూత

వసంత్‌ రాయిజి కన్నుమూత

ముంబై: భారత మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ వసంత్‌ నైసద్రాయ్‌ రాయిజి (100) కన్నుమూశారు. ఈ ఏడాది జనవరి 26న వందో పుట్టినరోజు జరుపుకున్న వసంత్‌ రాయి జి శనివారం తెల్లవారుజామను తన నివాసంలోనే మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్‌వాతో కలిసి ఈ ఏడాది ఆరంభంలో రాయిజి వందో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌.. ఆయన మృతిపై సంతాపం వ్యక్తంచేశాడు. రాయిజి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపాడు. 


logo