బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 00:41:00

సన్‌రైజర్స్‌ స్పాన్సర్‌గా వాల్వొలిన్‌

సన్‌రైజర్స్‌ స్పాన్సర్‌గా వాల్వొలిన్‌

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి ప్రముఖ కంపెనీ వాల్వొలిన్‌ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ సీఈవో షణ్ముగం గురువారం వెల్లడించారు. ‘వాల్వొలిన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తామనే నమ్మకముంది’ అని ఆయన అన్నారు. ఒప్పందంలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు జెర్సీపై వాల్వొలిన్‌ బ్రాండ్‌ దర్శనమివ్వనుంది. యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి లీగ్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.


logo