శనివారం 08 ఆగస్టు 2020
Sports - Jul 06, 2020 , 00:15:25

బొటాస్‌ బోణీ

బొటాస్‌ బోణీ

 ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రి నెగ్గిన మెర్సిడెస్‌ డ్రైవర్‌ 

స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న మెర్సిడెస్‌ రేసర్‌ వాల్తెరి బొటాస్‌(ఫిన్లాండ్‌) ఆ దిశగా తొలి అడుగు వేశాడు. కరోనా వైరస్‌ కారణంగా నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన 2020 ఫార్ములావన్‌ సీజన్‌ను విజయంతో ఆరంభించాడు. కరోనా వల్ల ప్రేక్షకులు లేకుండా ఆదివారం ఇక్కడ జరిగిన సీజన్‌ ఆరంభ రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో బొటాస్‌ విజేతగా నిలిచాడు. పోల్‌ పొజిషన్‌తో రేస్‌ ఆరంభించిన బొటాస్‌ అందరికంటే ముందు లక్ష్యాన్ని చేరాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు రేస్‌లో పాల్గొంటే.. అందులో 11 మంది గమ్యాన్ని చేరుకోగలిగారు. ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ ద్వితీయ స్థానంలో రేసును ముగించగా.. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయి స్‌ హామిల్టన్‌ పెనాల్టీల వల్ల నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు. మెక్‌లారెన్‌ రేసర్‌ లాండో నోరిస్‌ మూడో స్థానం సాధించాడు. 

వివక్షకు వ్యతిరేకంగా..

వర్ణ వివక్షపై ఫార్ములా వన్‌ రేసర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రి రేస్‌కు ముందు ఎండ్‌ రేసిజం(వివక్ష అంతమవ్వా లి) అని రాసి ఉన్న టీ షర్టులను మొత్తం 20 మంది రేసర్లు ధరించారు. బ్రిటన్‌ స్టార్‌ లూ యిస్‌ హామిల్టన్‌ సహా మరికొందరు మోకాళ్లపై కూర్చొని వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పలికారు.    


logo