మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 00:11:29

మాజీ ఆటగాళ్లను వినియోగించుకోవాలి: ద్రవిడ్‌

 మాజీ ఆటగాళ్లను వినియోగించుకోవాలి: ద్రవిడ్‌


ముంబై: క్రికెట్‌ అభివృద్ధిలో మాజీ ఆటగాళ్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భారత క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌.. రాష్ర్టాల క్రికెట్‌ సంఘాలకు  సూచించాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వెబినార్‌లో జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) చీఫ్‌ హోదాలో ద్రవిడ్‌ ప్రసంగించాడు. ఈ ఆన్‌లైన్‌ చర్చా కార్యక్రమంలో పలు రాష్ర్టాలకు చెందిన కార్యదర్శులు, ఆపరేషన్స్‌ విభాగాధిపతులతో పాటు ఎన్‌సీఏ ఎడ్యుకేషన్‌ హెడ్‌ సుజిత్‌ సోమసుందర్‌, ట్రైనర్‌ అశిష్‌ కౌశిక్‌ హాజరయ్యారు. కొవిడ్‌-19 విస్తరిస్తున్న నేపథ్యంలో శిక్షణ శిబిరాల నిర్వహణ విషయంలో ప్లేయర్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి వివరాల సేకరణ, క్రికెట్‌ పునరుద్ధరణపై చర్చ జరిగినట్లు రాష్ట్ర కార్యదర్శి ఒకరు మీడియాకు వివరించారు. ‘క్రికెట్‌ అభివృద్ధి కోసం మాజీల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ద్రవిడ్‌ సూచించాడు. వారి అనుభవం, సలహాలు, సూచనలు వృథా అయ్యే పరిస్థితి ఉండకూ డదని అన్నాడు. కానీ ఇది తప్పనిసరని చెప్పకుండానే ఆచరిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చనట్లు ఆయా రాష్ర్టాల ప్రతినిధులకు సూచించాడు’ అని ఆయన తెలిపాడు. మరోవైపు శిక్షణ పునరుద్ధరణలో ఎన్‌సీఏ.. రెండు రకాల పద్ధతులను అవలంభించబోతున్నట్లు తెలిసింది.   


logo