శనివారం 04 జూలై 2020
Sports - Apr 13, 2020 , 23:17:24

ఒలింపిక్స్ వాయిదాను వినియోగించుకోండి: ఏఎఫ్ఐ

ఒలింపిక్స్ వాయిదాను వినియోగించుకోండి: ఏఎఫ్ఐ

ఒలింపిక్స్ వాయిదాను వినియోగించుకోండి: ఏఎఫ్ఐ

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ కార‌ణంగా వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డ్డ టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోమని అథ్లెట్ల‌కు జాతీయ అథ్లెటిక్స్ స‌మాఖ్య‌(ఏఎఫ్ఐ) సూచించింది. కొవిడ్‌-19 నియంత్ర‌ణ‌కు దేశ వ్యాప్తంగా న‌డుస్తున్న లాక్‌డౌన్ స‌మ‌యంలో మాన‌సికంగా అంద‌రు ద్రుడంగా ఉండాల‌ని ఏఎఫ్ఐ పేర్కొంది. వాస్త‌వానికి టోక్యో ఒలింపిక్స్ జూలైలో జ‌రుగాల్సి ఉన్నా..క‌రోనా కార‌ణంగా వ‌చ్చే ఏడాదికి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఏఎఫ్ఐ సోమ‌వారం వీడియో కాన్ప‌రెన్స్ నిర్వ‌హించింది. ఇందులో 50 మంది అథ్లెట్లు, 30 మందికి పైగా సమాఖ్య స‌భ్యులు పాల్గొన్న‌ట్లు ఏఎఫ్ఐ అధ్య‌క్షుడు అదిల్లె సుమ‌రివాలా పేర్కొన్నారు. బెంగళూరు, పటియాల‌, ఊటీ సాయ్ కేంద్రాల్లో అథ్లెట్లు శిక్ష‌ణ పొందుతున్నార‌ని, లాక్‌డౌన్‌తో దొరికిన స‌మ‌యాన్ని అంద‌రు శిక్ష‌ణ‌కు ఉప‌యోగించుకోవాల‌ని సుమ‌రివాలా సూచించారు. వ‌చ్చే ఏడాది ఒలింపిక్స్‌తో పాటు ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్‌, బ‌ర్మింగ్‌హామ్‌(2022) కామ‌న్వెల్త్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు ఇది స‌రైన స‌మ‌యమ‌న్నారు. 


logo