మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 18:43:59

ధోనీ, నేను కలిసి ఫుట్​బాల్ చూసేవాళ్లం

ధోనీ, నేను కలిసి ఫుట్​బాల్ చూసేవాళ్లం

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ తరఫున తన రెండేండ్ల ప్రయాణాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్​మన్ సామ్ బిల్లింగ్స్ గుర్తుచేసుకున్నాడు. సూపర్​ కింగ్స్​ కెప్టెన్ ధోనీతో తన అనుబంధాన్ని వెల్లడించాడు. ప్రీమియర్ లీగ్ ఫుట్​బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ అంటే మహీకి ఎంత ఇష్టమో చెప్పాడు. ఇద్దరూ కలిసి ధోనీ రూమ్​లోనే ప్రీమియర్ లీగ్​ మ్యాచ్​లు చూసేవాళ్లమని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో బిల్లింగ్స్ అన్నాడు.

“మాంచెస్టర్ యునైటెడ్​కి ధోనీ పెద్ద అభిమాని. అతడితో స్నేహానికి నాకు ఈ విషయం కూడా ఉపయోగపడింది. మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ ఉన్నప్పుడల్లా అతడు ఆహ్వానించేవాడు. ధోనీ రూమ్​లోనే కలిసి మ్యాచ్ చూసేవాళ్లం. ధోనీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. విషయాలను నేర్చుకోవాలంటే అతడి కంటే అత్యుత్తమమైన వ్యక్తి మరొకరు ఉండరు. ధోనీ ఎదుటివారిని ఎంతో అర్థం చేసుకుంటాడు. మెదడును చదివేస్తాడు. ఎంజాయ్ చేసేలా తన పరిసరాలను మార్చేస్తాడు” అని బిల్లింగ్స్​ చెప్పాడు. కాగా కౌంటీ క్రికెట్​పై దృష్టి సారించేందుకు ఈ ఏడాది ఐపీఎల్ ఆడబోనని గత డిసెంబర్​లోనే సామ్ బిల్లింగ్స్ ప్రకటించాడు. 


logo