e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News కొకో గాఫ్‌కు కరోనా.. టోక్యో ఒలింపిక్స్‌కు దూరం

కొకో గాఫ్‌కు కరోనా.. టోక్యో ఒలింపిక్స్‌కు దూరం

కొకో గాఫ్‌కు కరోనా.. టోక్యో ఒలింపిక్స్‌కు దూరం

వాషింగ్టన్‌: అమెరికన్‌ ఆశా కిరణం, టెన్నిస్‌ క్రీడాకారిణి కొకో గాఫ్‌ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ 17 ఏండ్ల యువ సంచలనం టోక్యో ఒలింపిక్స్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈనేపథ్యంలో తాను టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేదు. ఈ వార్తను మీతో పంచుకోవడం నిరాశ కలిగించింది. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిథ్యం వహించాలన్నది నా చిరకాల కల. భవిష్యత్తులో ఇది నిజమవడానికి నాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నాను’ అని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్న కొకో గాఫ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఒలింపిక్స్‌లో ఆడనున్న అమెరికా బృందానికి ఆమె బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పింది. ప్రతిఒక్క ఒలింపియన్‌, ఒలింపిక్‌ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

కాగా, ఇప్పటికే అమెరికా దిగ్గజ క్రీడాకారులైన సెరెనా విలియమ్స్‌, రఫెల్‌ నడాల్‌, హాలెప్‌, వావ్రింకా, గతేడాది యూఎస్‌ ఓపెన్‌ విన్నర్‌ డొమినిక్‌ థీమ్‌ ఇప్పటికే తాము ఒలింపిక్స్‌లో పాల్గొనడంలేదని ప్రకటించారు. వీరితోపాటు స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ కూడా టోక్యో ఒలింపిక్స్‌ నుంచి తప్పుకున్నాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొకో గాఫ్‌కు కరోనా.. టోక్యో ఒలింపిక్స్‌కు దూరం
కొకో గాఫ్‌కు కరోనా.. టోక్యో ఒలింపిక్స్‌కు దూరం
కొకో గాఫ్‌కు కరోనా.. టోక్యో ఒలింపిక్స్‌కు దూరం

ట్రెండింగ్‌

Advertisement