గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 13, 2020 , 08:51:28

యూఎస్‌ ఓపెన్‌ మహిళల విజేత ఒసాకా

యూఎస్‌ ఓపెన్‌ మహిళల విజేత ఒసాకా

న్యూయార్క్‌ : జపాన్‌కు చెందిన నయోమీ ఒసాకా యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గింది. ఫైనల్ మ్యాచ్‌లో 1-6, 6-3, 6-3తో ఒసాకా బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకాను వెనక్కి నెట్టి టైటిల్‌ను ఎగరేసుకొని పోయింది. 22 ఏళ్ల ఒసాకా తన కెరీర్‌లో రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకోగా..  మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను నెగ్గింది. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ గంటా 53 నిమిషాల పాటు జరిగింది. అజరెంకా మొదటి సెట్‌ను 1-6తో ఈజీగా గెలిచింది. వెంటనే పుంజుకున్న ఒసాకా సెకండ్‌ సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో పుంచుకున్న ఒసాకా ఇక అజరెంకాకు మరో అవకాశం ఇవ్వకుండగా వరుస సెట్లలో పైచేయి సాధించింది. ఈ క్రమంలో మూడో సెట్‌లోనూ 6-3తో నెగ్గింది.

అలాగే రెండు, మూడు సెట్లలో బ్రేక్ పాయింట్లు ఒసాకాకు కలిసొచ్చాయి. అజరెంకా 5/10 బ్రేక్ పాయింట్లు సాధించగా.. ఒసాకా 12 బ్రేక్ పాయింట్లలో 5 సాధించింది. ఒసాకా 6 ఏస్‌లు సంధించింది. అజరెంకా రాకెట్ నుంచి మూడు దూసుకెళ్లాయి. మొదటి సెట్‌లో ఏ ఒత్తిడి లేకుండా ఆడిన అజరెంకా.. చివరి రెండు సెట్లలో తడబడింది. అజరెంకా ఏడేళ్ల తర్వాత తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్స్‌లో 24వ గ్రాండ్ స్లామ్‌ టైటిల్ కోసం బరిలోకి దిగిన ఆమె సెరెనాపై విజయం సాధించింది. ఒసాకా ఇంతకు ముందు 2018లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గింది. ఆ మ్యాచ్‌లో సెరెనాపై విజయం నెగ్గింది. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి జపాన్ క్రీడాకారిణిని ఆమె.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo