శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 09:34:39

యూఎస్ ఓపెన్‌:‌ రెండో రౌండ్‌లోకి ప్ర‌వేశించిన సెరెనా

యూఎస్ ఓపెన్‌:‌ రెండో రౌండ్‌లోకి ప్ర‌వేశించిన సెరెనా

న్యూయార్క్‌: అమెరిక‌న్‌ వెట‌ర‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్ సెరెనా విలియ‌మ్స్ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. యూఎస్ ఓపెన్‌లో అత్య‌ధిక సింగిల్స్ గెలుపొందిన క్రీడాకారిణిగా చ‌రిత్ర సృంష్టించింది. న్యూయార్క్‌లో జ‌రుగుతున్న యూఎస్ ఓపెన్‌లో అమెరికాకే చెందిన క్రిస్టీపై వ‌రుస సెట్ల‌లో గెలుపొంది ఈ ఘ‌న‌త సాధించించింది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పోరాడుతున్న సెరెనా 7-5, 6-3తో క్రిస్టీపై సునాయాసంగా గెలుపొంది రెండో రౌండ్‌లోకి ప్ర‌వేశించింది. 

మ్యాచ్‌లో క్రిస్టీ గ‌ట్టి పోటీనిచ్చిప్ప‌టికీ సెరెనా వ‌రుస సెట్ల‌లో గెలుపొందింది. కాగా, 38 ఏండ్ల సెరెనా చివ‌రిసారిగా 2017లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో గెలుపొందింది. దీంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన క్రీడాకారిణిగా నిలిచింది.సెరేనా త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను మార్గ‌రీటా గాస్ప‌రియ‌న్‌తో గురువారం త‌ల‌ప‌డ‌నుంది. 


logo