కొలంబో: శ్రీలంక వెటరన్ ఓపెనర్ ఉపుల్ తరంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 36 ఏండ్ల తరంగ 2017లో చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్లో 31 టెస్టులు, 235 వన్డేలు, 26 టీ 20లు ఆడిన తరంగ.. పదిహేనేండ్ల కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 9,112 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు ఉన్నాయి.