శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 16, 2020 , 13:43:59

ధోనీ, రైనా రిటైర్మెంట్‌పై యూపీ సీఎం ఎమన్నారంటే..

ధోనీ, రైనా రిటైర్మెంట్‌పై యూపీ సీఎం ఎమన్నారంటే..

లక్నో : భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ జట్టును విజయాల బాటలో నడిపించి, అంత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. దుబాయిలో జరుగనున్న ఐపీఎల్‌ సన్నద్ధమవుతున్న ధోనీ.. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున శనివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన కాసేపటికే ఆల్‌రౌండర్‌ సురేష్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, అభిమానులను షాక్‌కు గురి చేశారు. వీరి రిటైర్మెంట్‌ ప్రకటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. ధోని.. అత్యంత ప్రతిభావంతుడని.. అతని రిటైర్మెంట్‌తో ఓ శకం ముగిసిందని అన్నారు. ధోనీ దేశానికి ఎంతో గౌర‌వం తెచ్చార‌ని.. ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా నిలిచార‌ని కొనియాడారు. కొత్త ఇన్సింగ్స్‌ ప్రారంభించిన ధోనీకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. సురేష్ రైనా కూడా గొప్ప ఆటగాడని.. ఆల్‌ రౌండర్‌గా తన ప్రతిభ చాటుకున్నాడని, యూపీ రత్నం అంటూ యోగీ అభినందించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
logo