మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 18, 2020 , 00:46:51

2022లో అండర్‌-17 ఫిఫా ప్రపంచకప్‌

 2022లో అండర్‌-17 ఫిఫా ప్రపంచకప్‌

న్యూఢిల్లీ: భారత్‌ వేదికగా ఈ ఏడాది జరుగాల్సిన అండర్‌-17 మహిళల ఫిఫా ప్రపంచకప్‌ మళ్లీ వాయిదా పడింది. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన ప్రపంచకప్‌ను ఫిఫా వరల్డ్‌ గవర్నింగ్‌ బాడీ రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న కొవిడ్‌-19 పరిస్థితులను గమనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిఫా పేర్కొంది. ఈ ఏడాదిలో జరగాల్సి ఉన్న మహిళల యూత్‌ టోర్నీలను తిరిగి వాయిదా వేయడానికి ఇష్టపడని ఫిఫా రద్దు చేసింది. అయితే 2020 హక్కులను దక్కించుకున్న ఆతిథ్య దేశాలకే 2022లో నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో కోస్టారికాలో ఫిఫా మహిళల అండర్‌-20 ప్రపంచకప్‌తో పాటు భారత్‌లో అండర్‌-17 మెగాటోర్నీ 2022లో జరుగనుంది.