బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 18, 2020 , 19:05:59

MI vs KXIP: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ శర్మ

MI vs KXIP: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ శర్మ

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో మరో  రసవత్తర సమరానికి  రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌ల్లో ధనాధన్‌ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన  ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌   జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్‌ గెలిచిన  ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. తుది జట్టులో  ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు రోహిత్‌ చెప్పాడు. పాయింట్ల పట్టికలో ముంబై రెండో స్థానంలో ఉండగా పంజాబ్‌ ఆఖరి స్థానంలో ఉంది.  ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే పంజాబ్‌ ప్రతీ మ్యాచ్‌లో గెలవాల్సిందే.