గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 15, 2020 , 15:31:11

స్మార్ట్‌వాచ్‌ ధరించిన అంపైర్‌..ఐసీసీ మందలింపు

స్మార్ట్‌వాచ్‌ ధరించిన అంపైర్‌..ఐసీసీ మందలింపు

సౌతాంప్టన్‌: ఆతిథ్య ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య సౌతాంప్టన్‌ వేదికగా రెండో టెస్టు జరుగుతున్నది. ఈ టెస్టుకు  ఇంగ్లీష్‌  అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు.  మ్యాచ్‌ సమయంలో స్మార్ట్‌వాచ్‌ ధరించినందుకు అంపైర్‌ రిచర్డ్‌ను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ)  మందలించింది.  రెండో టెస్టు ఓపెనింగ్‌ డే మొదటి సెషన్‌లో  47ఏండ్ల కెటిల్‌బరో స్మార్ట్‌వాచ్‌ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాడు.

ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న అంపైర్‌ వెంటనే వాచ్‌ను తీసివేశాడు. మ్యాచ్‌ ఆరంభ రోజు భోజనం విరామం తర్వాత వాచ్‌ లేకుండానే  అంపైర్‌ విధులు నిర్వర్తించారు. ఐతే రిచర్డ్‌ స్మార్ట్‌వాచ్‌ ధరించడంతో  అతనితో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ)  మాట్లాడిందని ఒక నివేదిక తెలిపింది. నిబంధనలకు విరుద్దంగా వాచ్‌ ధరించినందుకు రిచర్డ్‌ను ఐసీసీ మందలించింది. 

ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు లేదా మ్యాచ్‌ అధికారులు ఆట సమయంలో ఎటువంటి ట్రాన్స్‌మిటింగ్‌ డివైజ్‌లను  ధరించడానికి అనుమతిలేదు. మొబైల్‌ ఫోన్లు కూడా మ్యాచ్‌ ఆరంభానికి ముందే అవినీతి నిరోధక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఆట ముగిసిన తర్వాతనే వాటిని అందజేస్తారు. 


logo