బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 10, 2020 , 15:13:28

సిగ్న‌ల్ కోసం చెట్లెక్కుతున్న ఐసీసీ ప్యాన‌ల్ అంపైర్‌

సిగ్న‌ల్ కోసం చెట్లెక్కుతున్న ఐసీసీ ప్యాన‌ల్ అంపైర్‌

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్యాన‌ల్ అంపైర్ అనిల్ చౌద‌రి.. మొబైల్ నెట్‌వర్క్ కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నాడు. సిగ్న‌ల్ కోసం చెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో.. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ విధించ‌డానికి ముందు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని త‌న స్వ‌గ్రామానికి వెళ్లిన అనిల్ చౌద‌రి.. అక్క‌డ ఇరుక్కుపోయాడు. ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి శామ్లీ జిల్లాలోని డాంగ్రోల్ గ్రామంలో ఉన్న అనిల్‌.. ఢిల్లీలో ఉన్న ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడేందుకు తీవ్ర‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 

మారుమూల గ్రామం కావ‌డంతో అక్క‌డ స‌రైన సిగ్న‌ల్ అంద‌క‌.. పోలాల వెంట తిరుగుతు నెట్‌వ‌ర్క్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. `మార్చి 16 నుంచి ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి ఇక్క‌డే ఉన్నా. చాలా రోజులైంది క‌దా అని స్వ‌గ్రామానికి వ‌స్తే.. లాక్‌డౌన్ కార‌ణంగా ఇక్క‌డే ఉండిపోవాల్సి వ‌చ్చింది. ఇక్క‌డ నెట్‌వ‌ర్క్ స‌రిగ్గా లేదు. ఢిల్లీలో ఉన్న‌వారితో మాట్లాడాలంటే సిగ్న‌ల్ అంద‌డం లేదు. దీనికోసం ఊరి బ‌య‌ట‌కు కూడా వెళ్లా.. చెట్లు ఎక్కి కూర్చున్నా ఫ‌లితం లేదు` అని అత‌డు చెప్పుకొచ్చాడు.


logo