సోమవారం 26 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 03:39:44

‘నీ పరుగులు బంగారం ధర కంటే ఎక్కువ’: చోప్రా

‘నీ పరుగులు బంగారం ధర కంటే ఎక్కువ’: చోప్రా

దుబాయ్‌: సందర్భానికి తగినట్లు వ్యాఖ్యానించడంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా దిట్ట. ప్రశంసించడం, విమర్శించడంలో చోప్రా.. ఆరితేరాడు అనడంలో అతిశయోక్తి లేదేమో. గురువారం పంజాబ్‌, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను చోప్రా తన యూట్యూబ్‌ చానల్‌లో విశ్లేషించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచిన కేఎల్‌ రాహుల్‌పై ప్రశంసలు కురిపించిన ఆకాశ్‌.. మరోవైపు ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్‌సీబీ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను విమర్శించాడు. ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో ఉమేశ్‌ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. అతనిచ్చిన పరుగులు.. ఈ మధ్య కాలంలో బంగారం రేట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. లెగ్‌స్టంప్‌ దిశగా అతను వేసిన బంతులకు దీపావళికి వచ్చే బహుమతుల కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి’ అని అన్నాడు. 


logo