శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 18, 2020 , 15:09:42

ఉమేశ్‌ అదుర్స్‌..ఒకే ఓవర్లో రెండు వికెట్లు

ఉమేశ్‌ అదుర్స్‌..ఒకే ఓవర్లో రెండు వికెట్లు

అడిలైడ్‌: భారత్‌తో డే/నైట్‌ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే కీలక వికెట్లు చేజార్చుకుంది. టీమ్‌ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ కంగారూలను ఇబ్బంది పెడుతున్నారు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా జట్టుకు అండగా నిలిచిన  లబుషేన్(47)‌ 54వ ఓవర్లో వెనుదిరిగాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన అదే ఓవర్‌లో లబుషేన్‌తో పాటు అప్పుడే క్రీజులోకి వచ్చిన  పాట్‌ కమిన్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన ఉమేశ్‌ భారత్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ప్రత్యర్థిని కట్టడి చేసిన కోహ్లీసేన గులాబీ టెస్టుపై పట్టుబిగించింది.  55 ఓవర్లకు ఆసీస్‌ 7 వికెట్లకు 115 పరుగులు చేసింది. టిమ్‌ పైన్‌(30), మిచెల్‌ స్టార్క్‌(0) క్రీజులో ఉన్నారు. 

ఇవి కూడా చదవండి:

2000 కి.మీ. మేర చైనా మ‌రో గోడ‌

కోవిడ్ గ‌ర్భిణుల‌కు పుట్టిన శిశువుల్లో యాంటీబాడీలు