సోమవారం 06 జూలై 2020
Sports - Jun 05, 2020 , 21:43:17

కరోనా నుంచి కోలుకున్న క్రికెటర్‌

కరోనా నుంచి కోలుకున్న క్రికెటర్‌

కరాచీ: కరోనా వైరస మహమ్మారి బారిన పడిన పాకిస్థాన్‌ మాజీ ఓపెనర్‌ తౌఫీక్‌ ఉమర్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. రెండు వారాల క్రితం జరిపిన టెస్టుల్లో తౌఫిక్‌ కొవిడ్‌-19 సోకినట్లు నిర్ధరణ కాగా.. అప్పటి నుంచి ప్రత్యేక చికిత్స పొందుతున్నాడు. తాజాగా శుక్రవారం జరిపిన టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిందని అతడు తెలిపాడు. 

‘కరోనా వైరస్‌ను తీవ్రంగా పరిగణించమని ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి చేస్తున్నా. భౌతిక దూరంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తప్పక పాటించండి. పాజిటివ్‌ అని తేలినప్పటి నుంచి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నా. పిల్లల్ని, పెద్దవాళ్లను కలవకుండా ఒంటరిగా గడిపా. మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌ తరఫున 44 టెస్టులు, 22 వన్డేలు ఆడిన తౌఫీక్‌ ఇప్పుడు పూర్తిగా కొలుకున్నట్లు తెలిపాడు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఫస్ట్‌క్లాస్‌ ప్లేయర్లు కొవిడ్‌-19 బారిన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. లెగ్‌ స్పిన్నర్‌ రియాజ్‌ షేక్‌, జాఫర్‌ సర్ఫరాజ్‌ కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 


logo