బుధవారం 08 జూలై 2020
Sports - May 10, 2020 , 15:15:41

ఐపీఎల్​కు ఆతిథ్యమిస్తాం: ముందుకొచ్చిన యూఏఈ

ఐపీఎల్​కు ఆతిథ్యమిస్తాం: ముందుకొచ్చిన యూఏఈ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్​(ఐపీఎల్​) 13వ సీజన్​కు ఆతిథ్యమిచ్చేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​(యూఏఈ) క్రికెట్​ బోర్డు ముందుకొచ్చింది. కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఈ ఏడాది సీజన్​ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐకి ఆ బోర్డు ఆఫర్ ఇచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్ వెల్లడించారు. “ఐపీఎల్​కు ఆతిథ్యమిస్తామని యూఏఈ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ రవాణాలేదు. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడేం చెప్పలేం” అని ధుమాల్ వెల్లడించారు. ఆటగాళ్ల ఆరోగ్యం, రక్షణకే ప్రాధాన్యమిస్తామని ఆయన అన్నారు. యూఏఈకి ఐపీఎల్ కొత్తేం కాదు. భారత్​లో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన కారణంగా బీసీసీఐ ఆ ఏడాది 20 ​మ్యాచ్​లను యూఏఈలో నిర్వహించింది. కాగా ఐపీఎల్ 13వ సీజన్​కు ఆతిథ్యమిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇటీవల బీసీసీఐకి ప్రతిపాదించింది. 


logo