మంగళవారం 07 జూలై 2020
Sports - Jun 06, 2020 , 21:25:04

ఐపీఎల్‌ నిర్వహణకు మేం రెడీ

ఐపీఎల్‌ నిర్వహణకు మేం రెడీ

దుబాయ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో నిరవధికంగా వాయిదా పడ్డ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ను తాము నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. భారత్‌లో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. లీగ్‌ను విదేశాల్లో నిర్వాహించాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పిన నేపథ్యంలో యూఏఈ బోర్డు ఈ ప్రకటన చేసింది.

గతంలో శ్రీలంక ప్రభుత్వం కూడా లీగ్‌ నిర్వహణకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ‘గతంలోనూ ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించిన అనుభవం యూఏఈ క్రికెట్‌ బోర్డుకు ఉంది. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలకు మేం ఆతిథ్యమిచ్చాం. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం’ అని యూఏఈ బోర్డు కార్యదర్శి ముబష్షిర్‌ ఉస్మానీ పేర్కొన్నారు. 

గతంలో మనదేశంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు వీదేశాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ రౖద్దెతే.. ఆ స్థానంలో ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నది. ఖాళీ మైదానాల్లో పొట్టి ప్రపంచకప్‌ నిర్వహించడం కంటే దాన్ని వాయిదా వేయడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) జూన్‌ 10న నిర్వహించనున్న సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.  


logo