సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 01, 2020 , 01:37:56

భారత్‌ X పాకిస్థాన్‌

 భారత్‌ X పాకిస్థాన్‌
  • అండర్‌-19 సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థుల పోరు
  • క్వార్టర్స్‌లో ఆఫ్ఘన్‌పై పాక్‌ గెలుపు

బెనోని(దక్షిణాఫ్రికా): క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే  భారత్‌, పాకిస్థాన్‌ సమరానికి అండర్‌-19 ప్రపంచకప్‌ వేదిక కానుంది. ఫిబ్రవరి 4వ తేదీన జరిగే సెమీఫైనల్లో యువ టీమ్‌ఇండియా.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో పాక్‌ విజయం సాధించి, భారత్‌కు సెమీస్‌లో ప్రత్యర్థిగా మారింది. కెప్టెన్‌ పర్హాన్‌ జకీల్‌(40) మినహా మిగిలిన వారు రాణించలేకపోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘన్‌ జట్టు 49.1ఓవర్లలో 189పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత అరంగేట్ర ఓపెనర్‌ మహమ్మద్‌ హురైరా(64) రాణించడంతో పాకిస్థాన్‌ స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగానే ఛేదించగలిగింది. హురైరాను ఆఫ్ఘన్‌ బౌలర్‌ నూర్‌ అహ్మద్‌ మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేసినా.. ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడడంతో పాక్‌ 41.1ఓవర్లలోనే 4వికెట్లు కోల్పోయి 190పరుగులు చేసింది. 


logo