ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 06, 2020 , 20:10:01

MIvRR: దూకుడుగా ఆడుతున్న ముంబై ఇండియన్స్

MIvRR: దూకుడుగా ఆడుతున్న ముంబై ఇండియన్స్

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ దూకుడుగా ఆడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(23: 15 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), రోహిత్‌ శర్మ శుభారంభం అందించారు.  వీరిద్దరూ మొదటి ఓవర్‌ నుంచే రన్‌రేట్‌ 10కి తగ్గకుండా పరుగులు రాబట్టారు. ఐపీఎల్‌లోనే తొలి మ్యాచ్‌ ఆడుతున్న యువ బౌలర్‌ కార్తీక్‌ త్యాగీ తన మొదటి ఓవర్‌లోనే వికెట్‌ తీసి అదరగొట్టాడు.

ఐదో ఓవర్‌ ఐదో బంతికి  ప్రమాదకర డికాక్‌ను అతడు పెవిలియన్‌ పంపాడు. త్యాగీ వేసిన ఏడో ఓవర్లోను బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడలేకపోతున్నారు.  ప్రస్తుతం రోహిత్‌(29), సూర్యకుమార్‌(7) యాదవ్‌ క్రీజులో ఉన్నారు.  7 ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్‌ నష్టానికి 65 పరుగులు చేసింది.