శుక్రవారం 03 జూలై 2020
Sports - May 30, 2020 , 00:23:05

టెన్నిస్‌ కొత్త కొత్తగా

టెన్నిస్‌ కొత్త కొత్తగా

ప్రాగ్‌: ప్రమాదకర కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత క్రీడల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య తొలిసారి చెక్‌ రిపబ్లిక్‌లో టెన్నిస్‌ టోర్నీ కొత్త కొత్తగా జరిగింది. ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో లోకల్‌ స్టార్‌ పెట్రా క్విటో వా విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో క్విటోవా 6-3, 6-3తో కోరోలినా ముచ్కొవాపై అలవోక విజయం సాధించిం ది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బాల్‌ బాయ్స్‌, గర్ల్స్‌తో పాటు చైర్‌ అంపైర్లు మాస్క్‌లు ధరించగా, ప్లేయర్లు షేక్‌ హ్యాండ్‌లతో కాకుండా.. రాకెట్‌ షేక్‌లతో సరిపెట్టుకున్నారు. 


logo