శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 23, 2020 , 00:48:33

చెన్నై దూకుడు

చెన్నై దూకుడు
  • ముంబైపై 4-3తో విజయం

చెన్నై : ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో చెన్నై సూపర్‌స్టార్స్‌ జట్టు అదరగొడుతున్నది. బుధవారమిక్కడ ముంబై రాకెట్స్‌తో జరిగిన మూడో టైను 4-3తో చెన్నై గెలిచింది. తొలుత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆతిథ్య జట్టు విజయం సాధించగా.. పురుషుల సింగిల్స్‌లో యువ కెరటం లక్ష్యసేన్‌ 15-12, 15-10తో ముంబై ప్లేయర్‌ లీడాంగ్‌ కెయిన్‌పై గెలిచాడు. ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న మరో మ్యాచ్‌లో టి సుగత్రో 14-15, 15-7, 15-10తేడాతో రాకెట్స్‌ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌పై గెలువడంతో చెన్నై దూసుకెళ్లింది. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌, మహిళల సింగిల్స్‌లో చెన్నైకి పరాజయాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ గోపీచంద్‌ కుమార్తె గాయత్రి గెలిచే మ్యాచ్‌ను కాస్తలో చేజార్చుకుంది. నిర్ణయాత్మక గేమ్‌లో చాలాసేపు ఆధిక్యంలో కొనసాగినా చివర్లో కాస్త తడబడింది. 


logo