బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 14:45:09

మాథ్యూ వేడ్‌ అర్ధసెంచరీ

మాథ్యూ వేడ్‌ అర్ధసెంచరీ

సిడ్నీ: భారత్‌తో మూడో టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ అర్ధసెంచరీ సాధించాడు.  ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన వేడ్‌ 34 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో వికెట్లు కోల్పోతున్నా  స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. రెండో టీ20లోనూ వేడ్‌ అర్ధశతకంతో రాణించిన విషయం తెలిసిందే.

దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వేడ్‌ అలవోకగా పరుగులు సాధిస్తున్నాడు.   12 ఓవర్లకు ఆస్ట్రేలియా 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. ఇప్పటి వరకు వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కడే అరోన్‌ ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌ వికెట్లను పడగొట్టాడు. జట్టు మెరుగైన స్కోరు సాధించడంతో  హార్డ్‌హిట్టర్‌ మాక్స్‌వెల్(11)‌, వేడ్(58)‌  చెలరేగాలని చూస్తున్నారు.  


logo