సోమవారం 13 జూలై 2020
Sports - May 15, 2020 , 00:33:19

కన్న కొడుకునే చంపాడు

కన్న కొడుకునే చంపాడు

టర్కీ ఆటగాడి దాష్టీకం 

అంకారా: టర్కీ ఫుట్‌బాలర్‌ కెవ్హర్‌ టోక్టాస్‌.. తన కన్న కొడుకును అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 23న కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్న కారణంగా ఐదేండ్ల కొడుకు ఖాసిమ్‌తో పాటు టోక్టాస్‌ దవాఖానలో చేరాడు. ఈనెల 4న ఖాసిమ్‌కు చికిత్స చేస్తున్న గదిలోకి వెళ్లిన టోక్టాస్‌.. అతడి ముఖాన్ని దిండుతో నులిమి ఊపిరి ఆడకుండా చంపేశాడు. తర్వాత తనకేం తెలియదన్నట్లు డాక్టర్లకు చెప్పాడు. వైద్యులు బాలుడిని ఐసీయూకు తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. కరోనాతో చనిపోయాడని అందరిని నమ్మించిన టోక్టాస్‌.. కొడుకు చనిపోయిన 11 రోజుల తర్వాత పశ్చాత్తాప పడి అసలు నిజం చెప్పాడు. ‘నా చిన్న కొడుకు ఖాసిమ్‌ అంటే అసలు ఇష్టం లేదు. ఈ కారణంగానే అతడిని చంపేశా. నాకు ఎలాంటి మానసిక సమస్యలు లేవు’ అని టోక్టాస్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.  


logo