బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 09, 2021 , 01:33:52

నందినికి మరో పసిడి

నందినికి మరో పసిడి

  • 100 మీటర్ల హర్డిల్స్‌లో అగ్రస్థానం 

గువహటి (అసోం): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో తెలంగాణ అథ్లెట్‌ అగసర నందిని మరోసారి సత్తాచాటింది.  సోమవారం ఇక్కడ జరిగిన బాలికల అండర్‌-18.. 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె స్వర్ణ పతకం సాధించింది. 13.83 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నందిని అగ్రస్థానంలో నిలిచింది. తొలి రోజు పోటీల్లో లాంగ్‌జంప్‌లో పసిడి దక్కించుకున్న నందినికి ఈ చాంపియన్‌షిప్‌లో ఇది రెండో పతకం. బాలుర లాంగ్‌జంప్‌లో రాష్ట్ర అథ్లెట్‌ కె.ప్రణయ్‌ కాంస్య పతకం సాధించాడు. 6.68 మీటర్లు లంఘించి మూడోస్థానంలో నిలిచాడు. కాగా ఆదివారం జరిగిన బాలికల 100 మీటర్ల పరుగులో తెలంగాణ స్ప్రింటర్‌ జివాంజి దీప్తి 12.07 సెకన్లలో గమ్యాన్ని చేరి రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

VIDEOS

logo