Australian Open : నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీకు) ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రష్యా ఆటగాడు కరేన్ ఖచనోవ్పై 7-6(7-2), 6-4, 6-7(6-8), 6-3తో గెలుపొందాడు. మూడు గంటల 21 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సిట్సిపాస్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అతను ఈ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. అయితే.. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. ఫైనల్లో అతను నొవాక్ జకోవిచ్(సెర్బియా), టామి పౌల్ (అమెరికా) మ్యాచ్ విజేతతో తలపడనున్నాడు.
3 సార్లు సెమీఫైనల్లోనే
ఆస్ట్రేయన్ ఓపెన్లో సిట్సిపాస్కు అంత ఘనమైన రికార్డు లేదు. ఎందుకంటే… మెల్బోర్న్ పార్క్లో మూడు సార్లు సెమీఫైనల్లోనే ఇంటిబాట పట్టాడు. అలాంటిది అతను ఈసారి పట్టువదల్లేదు. అద్వితీయమైన ఆటతో ఖచనోవ్ను మట్టికరిపించాడు. ‘నాకు నంబర్ వన్ ర్యాంక్ అంటే చాలా ఇష్టం. ఆ క్షణం కోసం నేను ఎంతో కష్టపడుతున్నా. ఆటలో వరల్డ్ నంబర్ వన్ కావాలనేది నా చిన్నప్పటి కల. ఇప్పుడు నా కలను నిజం చేసుకోవడానికి చేరువలో ఉన్నా. ఫైనల్ పోరు అనేది చాలా పెద్దది. ఇది చాలా ముఖ్యమైన ఫైనల్’ అని మ్యాచ్ అనంతరం సిట్సిపాస్ అన్నాడు.