మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 23, 2020 , 00:13:52

రజతంతో ముగించారు

రజతంతో ముగించారు
  • చివరి రోజు టెన్నిస్‌లో తెలంగాణకు పతకం
  • మొత్తంగా 21 మెడల్స్‌తో 15వ స్థానం
  • ఘనంగా ఖేలో ఇండియా ముగింపు వేడుకలు

గువాహటి: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ మూడో ఎడిషన్‌ అట్టహాసంగా ముగిసింది. తెలంగాణ మొత్తం 21పతకాలు(7స్వర్ణ, 6రజత, 8కాంస్యాలు) దక్కించుకొని 15వ స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన టెన్నిస్‌ బాలికల అండర్‌-21 ఫైనల్లో తెలంగాణ జోడీ శ్రావ్య శివానీ- సామ సాత్విక 3-6, 6-3, 7-10తేడాతో మహారాష్ట్ర ద్వయం స్నేహల్‌ మనే - మిహికా యాదవ్‌ చేతిలో పోరాడి ఓడి రజతం పతకం దక్కించుకుంది. తొలి గేమ్‌లో వెనుకబడిన మన ప్లేయర్లు ఆ తర్వాత పుంజుకొని మ్యాచ్‌ను నిర్ణయాత్మక గేమ్‌కు తీసుకుకెళ్లారు. చివరి వరకు పోరాడినా ఆఖర్లో కాస్త తడబడి మ్యాచ్‌ను ప్రత్యర్థి జోడీకి సమర్పించుకున్నారు. గతేడాది పోటీల్లో తెలంగాణ ఐదు స్వర్ణాలు(మొత్తం 22 పతకాలు) సాధించగా.


ఈసారి ఆ సంఖ్య ఏడుకు పెరిగింది. కాగా మహారాష్ట్ర 256 పతకాల(78స్వ., 77ర., 101కా. )తో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించగా... హర్యానా 200(68స్వ., 60ర. 72కా.), ఢిల్లీ 122(39స్వ., 36ర., 47 కా.) పతకాలతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అసోం ముఖ్యమంత్రి సర్బానంద్‌ సోనొవాల్‌ ముఖ్య అతిథిగా హాజరై ఓవరాల్‌ చాంపియన్‌ మహారాష్ట్రకు ట్రోఫీని అందించారు. అసోం సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. 


logo
>>>>>>