బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 00:56:23

హైదరాబాద్‌లో జాతీయ టీటీ టోర్నీ

 హైదరాబాద్‌లో జాతీయ టీటీ టోర్నీ

హైదరాబాద్‌ వేదికగా ఈనెల 27 నుంచి 81వ జాతీయ సీనియర్‌, ఇంటర్‌ స్టేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం కాబోతున్నది. టోర్నీ బ్రౌచర్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ తన చాంబర్‌లో గురువారం ఆవిష్కరించారు.

  • బ్రౌచర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్‌ వేదికగా ఈనెల 27 నుంచి 81వ జాతీయ సీనియర్‌, ఇంటర్‌ స్టేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం కాబోతున్నది. టోర్నీ బ్రౌచర్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ తన చాంబర్‌లో గురువారం ఆవిష్కరించారు. రాష్ట్ర క్రీడాశాఖ, తెలంగాణ టీటీ అసోసియేషన్‌(టీఎస్‌టీటీఏ) ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జాతీయ టోర్నీ జరుగనుంది. ఇందులో వివిధ రాష్ర్టాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. టోర్నీ ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం క్రీడాహబ్‌గా రూపొందుతున్నదన్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో క్రీడామైదానాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెల 2వ తేదీ వరకు జరిగే జాతీయ టోర్నీకి  రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో క్రీడాకారులకు ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర టీటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యదర్శి ప్రకాశ్‌ రాజ్‌, మహేశ్వరి, సురేందర్‌ రెడ్డి, ఆనంద్‌బాబు, లక్ష్మీకాంత్‌, జగన్నాథ్‌ పాల్గొన్నారు. 

రాష్ట్ర జట్టు: అమన్‌(కెప్టెన్‌), స్నేహిత్‌, అలీ, రెహమాన్‌, సిరిల్‌, వరుణి జైస్వాల్‌, ప్రణీత, నివేదిత, మోనిక, శ్రిష్టి గుప్తా. 


logo
>>>>>>