ఆదివారం 23 ఫిబ్రవరి 2020
సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు

Feb 15, 2020 , 00:22:46
PRINT
సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు
  • ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్‌) ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు   జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం మీడియా సమావేశంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈనెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కటింగ్‌, మొక్కలు నాటడంతో వేడుకలు మొదలవుతాయన్నారు. సీఎం టీ-10 క్రికెట్‌ టోర్నీలో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్నాయని అన్నారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి చెక్కులు ఇస్తామని పేర్కొన్నారు. రక్తదానంతోపాటు, పలు సాంస్మృతిక  కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 


logo